వచ్చే పదేళ్లలో కచ్చితంగా తెలంగాణ సీఎం అవుతా : జగ్గారెడ్డి

వచ్చే పదేళ్లలో సీఎం అవుతానండు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా ప్రస్తుతం ఈ కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.

By :  Vamshi
Update: 2024-07-29 05:33 GMT

సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే,  కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న, లేకున్నా పదేళ్లలో కచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్నికి ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు. సంగారెడ్డిలో జరిగిన బోనాల వేడుకల్లో మాట్లాడుతూ తనకు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉన్నాయని పేర్కొన్నారు. వారి నాయకత్వంలో సీఎంని అవుతాన్నారు. జగ్గారెడ్డి ఈ కామెంట్స్‌తో కాంగ్రెస్ కార్యకర్తలు సీఎం..సీఎం అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

కాగా ఈయన గతంలో పలుమార్లు రాష్ట్రాన్నికి సీఎంని అవుతానని మాట్లాడిన సంగతి తెలిసిందే, రాష్ట్రంలో హస్తం అధికారంలోకి వచ్చినప్పటి ఆయన ఎమ్మెల్యేగా గెలవలేక పోయాడు. దీంతో ఆయనకు ప్రభుత్వంలో తగిన గుర్తింపు దక్కడం లేదని.. మీడియా వేదికగా చెప్పుకొస్తున్నారు. సంగారెడ్డిలో ఘనంగా బోనాల ఉత్సవాలను జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాలను చూసేందుకు భారీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. అలాగే నగరంలోని రామ్‌మందిర్‌ నుండి దుర్గమ్మ గుడి వరకు ఊరేగింపు చేశారు.

Tags:    

Similar News