కేంద్రం నుంచి ఆర్థిక సాయం ఇవ్వాలని కోరాం

డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

Update: 2024-08-24 12:22 GMT

తెలంగాణ ఆర్థిక పరిస్థితిని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ కు వివరించామని.. తమ రాష్ట్రాన్ని ఆదుకోవడానికి సాయం అందించాలని కేంద్ర మంత్రిని కోరామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రితో సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. సెంట్రల్‌ స్పాన్సర్డ్‌ స్కీముల్లో నిధుల వాటాతో పాటు ఏపీ రీ ఆర్గనైజేషన్‌ యాక్ట్‌ ప్రకారం తెలంగాణ ఇవ్వాల్సిన నిధులను వెంటనే విడుదల చేయాలని కోరామని అన్నారు. గత ప్రభుత్వం తీసుకున్న బడ్జెటేతర రుణాలు ఖజానాపై తీవ్ర భారం మోపుతున్నాయని, వాటిని రీ షెడ్యూల్ చేసి ఉపశమనం కలిగించాలని కోరారు. అప్పులకు వడ్డీ రూపంలోనే రూ.31,975 కోట్లు చెల్లించాల్సి వస్తుందని, వడ్డీ రేట్లు తగ్గించాలని కోరామన్నారు. ముఖ్యంగా ఎనిమిది అంశాలను కేంద్ర ఆర్థిక మంత్రికి వివరించామని అన్నారు. ఏపీ నుంచి తెలంగాణకు రావాల్సిన కరెంట్‌ బకాయిలు ఇప్పించాలని కోరానని చెప్పారు. తెలంగాణలోని వెనుకబడిన జిల్లాలకు కొన్నేళ్లుగా నిధులు విడుదల చేయడ లేదని, వెంటనే వాటిని విడుదల చేయాలని కోరానని తెలిపారు. త్వరలోనే రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి రాష్ట్ర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారన్నారు.

Tags:    

Similar News