తెలంగాణలో గిరిజన బతుకులు దయనీయం : ఎమ్మెల్యే పాల్వాయి

తెలంగాణలో గిరిజన బతుకులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి ఆరోపించారు. మంత్రి సీతక్క గ్రామాలకు ఒక్క రూపాయి నిధులను ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు.

By :  Vamshi
Update: 2024-08-10 13:07 GMT

నిన్న ప్రపంచ ఆదివాసీల దినోత్సవ సెలబ్రేషన్స్ అంటూ తెలంగాణ ప్రభుత్వం ఉరూర జరిపింది. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయని సిర్పూర్ కాగజ్‌నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు ఆరోపించారు. శనివారం నాడు బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కొమురం భీం జిల్లాలో గిరిజన మహిళలు ప్రసవం కోసం, పురిటి నొప్పులతో రెండు కిలోమీటర్లు నడవాల్సి వచ్చిందని హరీష్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. వాగు దాటగానే దారి మధ్యలోనే డెలివరి అవడంతో పుట్టిన శిశువు చనిపోతురని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో గిరిజన బతుకులు దయనీయమైన పరిస్థితుల్లో ఉన్నాయని అన్నారు. ఆదివాసీల గ్రామాలకు నేటికీ రోడ్లు లేవు.

మంత్రి సీతక్క మాత్రం గిరిజన గ్రామాలకు నాలుగేళ్లలో తారు రోడ్లు వేస్తామని చెబుతున్నారని ఇది త్వరలో సాధ్యం కావలని ఆయన కోరారు. పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది. గ్రామ పంచాయితీల్లో సర్పంచులు లేరు.. కాంగ్రెస్ ప్రభుత్వం తొమ్మిది నెలల్లో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క గ్రామాలకు ఒక్క రూపాయి నిధులను ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. పంచాయితీలన్ని గ్రామ కార్యదర్శులకు అప్పజెప్పారు. సీతక్క మీద చాలా నమ్మకం ఉండేది, కానీ గ్రామాల్లో పరిస్థితులు చూస్తుంటే సీతక్కపై ఆ నమ్మకం కోల్పోయేలా ఉంది అని హరీష్ బాబు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ మంత్రులంతా సంపాదించుకునే పనిలో బిజీగా ఉన్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీలు నిర్వీర్యం చేశారని పాల్వాయి హరీష్‌బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News