తెలంగాణపై ఢిల్లీ నుంచి కుట్ర జరిగే ప్రమాదం ఉంది : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

తెలంగాణ మళ్లీ ప్రమాదం అంచున ఉందని, దొడ్డిదారిన రాష్ట్ర వనరులను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

By :  Vamshi
Update: 2024-08-06 09:43 GMT

సీఎం రేవంత్ రెడ్డి విధానాలతో తెలంగాణలో నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. మంళవారం ఫ్రొఫెసర్ జయశంకర్ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ యుద్దభుమిగా ఉండేదని అన్నారు. వరంగల్ జిల్లా అడిషనల్ ఎస్పీగా తను జయశంకర్‌ను కలిశానాని, తెలంగాణలో ఎన్‌కౌంటర్లు లేకుండా నక్సలిజం సమస్యకు పరిష్కారం చూపాలని అడిగాని చెప్పారు.

ఆంధ్రా పోలీసులు తెలంగాణ పోలీసులను ఉమ్మడి రాష్ట్రంలో ఇబ్బందులు పెట్టారని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై జయశంకర్ పోలీసులకు దిశానిర్దేశం చేశారని ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ మళ్లీ ప్రమాదం అంచున ఉందని, దొడ్డిదారిన తెలంగాణ వనరులను దోచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో సమావేశం పెడితే అంతా ఆంధ్రా వారు వచ్చారు. తెలంగాణపై ఢిల్లీ నుంచి కుట్ర జరిగే అవకాశం ఉందని, అదృశ్య శక్తులు తెలంగాణను కబలించే అవకాశం ఉందని ప్రవీణ్ కుమార్ అన్నారు.

Tags:    

Similar News