కోరి తెచ్చుకున్న మొగడు కొట్టినా ఉండాలి...తిట్టినా పడాలి : నిరంజన్ రెడ్డి

తెలంగాణ అనేది నిరంతర జ్వాలని .. దానిని నిరంతరం కాపాడుకుంటామని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.

By :  Vamshi
Update: 2024-06-25 09:06 GMT

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడం ద్వారా తప్పును సరిదిద్దు కోలేరన్నారు. ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలనివ్వను అన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇంటింటికి తిరిగి కండువాలు కప్పుతున్నాడన్నారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఎంతో మంది ఎమ్మెల్యేలను లాక్కున్నాడని..కానీ తెలంగాణను ఆపలేక పోయాడాన్నారు. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు రైతులు ఎవరికీ రూ.2 లక్షల రుణాలు లేవుని .. ఈ విషయం బ్యాంకు అధికారులే చెబుతున్నారని నిరంజన్ రెడ్డి అన్నారు.

రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తారా ? కౌలు రైతులు ఎంత మంది ఉన్నారు ? వారికి రూ.15 వేలు ఇస్తారా అని ఆయన ప్రశ్నించారు. మహాలక్ష్మి పథకం కింద రూ.2500 ఎప్పుడు ఇస్తారో చెప్పాలన్నారు. ఎన్నికల్లో కొత్త రేషన్ కార్డులు ఇస్తాం అని చెప్పారు .. ఇప్పుడు రేషన్ కార్డులన్ని రద్దు చేసి పథకాలను కుదించే ప్రయత్నాల్లో ఉన్నారని ఆయన అన్నారు. అంబేద్కర్ పేరు మీద కాంగ్రెస్ రూ.12 లక్షలు ఇస్తాం అన్నారు .. ఏడు నెలలలో ఏ ఒక్కరికైనా ఇచ్చారా ప్రశ్నించారు. రాష్ట్రంలోని మేధావులు ఈ విషయంలో ప్రభుత్వాన్ని నిలదీయాలని విజ్ఞప్తి చేస్తున్నామని నిరంజన్ రెడ్డి తెలిపారు.పేదలకు రాష్ట్రంలో రెండు నెలలుగా ఫించన్లు ఇవ్వడం లేదాన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, మాజీ శాట్స్ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి పాల్గోన్నారు.

Tags:    

Similar News