అంద‌రి స‌మ‌క్షంలో నిర్ణ‌యించిన పేరే ధ‌ర‌ణి : ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి

తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ పేరును నాలుగు గోడ‌ల మ‌ధ్య పెట్ట‌లేద‌ని మంత్రి పొంగులేటికి ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు.

By :  Vamshi
Update: 2024-08-02 10:27 GMT

మాజీ సీఎం కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకొచ్చిన ధ‌ర‌ణి పోర్ట‌ల్ పేరును అనేక సంప్రదింపులు జరిపి అందరిని సమక్షంలో నిర్ణయం తీసుకున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి అన్నారు. శాసన సభలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డికి ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి కౌంట‌ర్ ఇచ్చారు. తెలంగాణలో రెవెన్యూ చ‌ట్టాల‌ను మార్చేందుకు నిర్వ‌హించిన అనేక మీటింగ్‌లో మంత్రి పొంగులేటి నాటి సీఎం కేసీఆర్‌తో ఉన్నారని పల్లా పేర్కొన్నారు.

తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రిదుర‌దృష్టం ఏంటంటే కాంగ్రెస్ సర్కార్‌లో ఇప్పుడు ఆయ‌న‌కు మంత్రిగా అవ‌కాశం వ‌చ్చింది. మిగ‌తా మంత్రులు తిట్టిన‌ట్టే పొంగులేటి కూడా కొన్ని అన‌రాని మాట‌లు అన్నారు. కేసీఆర్ ప‌ట్ల‌ అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌లు చేశారు. వారి విజ్ఞ‌త‌కే వ‌దిలేస్తున్నాను. ఎందుకంటే అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడు ఒదిగి ఉంటే మంచిది. కేసీఆర్ ప‌ట్ల అభ్యంత‌ర‌క‌ర వ్యాఖ్య‌ల‌ను ఖండిస్తున్నాన‌ని ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి తెలిపారు. ధరణి చట్టం వల్ల ప్రజలకు అనేక ప్రయోజనలు కలిగాయని ఆయన అన్నారు. రైతులకు బయోమెట్రిక్ ద్వారా భూ హక్కులు కల్పించినట్లు చెప్పారు. ధరణి ద్వారా భూ సంస్కరణలతో రైతులకు మేలు జరిగిందని ఎమ్మెల్యే ప‌ల్లా అన్నారు.

Tags:    

Similar News