జులై నెల వచ్చిన ఇంకా రైతు భరోసా దిక్కు లేదు : ఎమ్మెల్సీ తాత మధు

బీఆర్‌ఎస్ పాలనలో జూన్ మాసంలోనే రైతు బంధు ఇచ్చేమని ఎమ్మెల్సీ తాత మధు తెలిపారు

By :  Vamshi
Update: 2024-07-04 08:54 GMT

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్న పాలన గాడిన పడలేదని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాత మధు అన్నారు. తెలంగాణ భవన్ మీడియ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ సర్కార్ రైతు భరోసా కింద 15 వేలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పిందని..జులై నెల వచ్చిన ఇంకా రైతు భరోసా దిక్కు లేదన్నారు. రాష్ట్రంలో పరిపాలన గాలికి వదిలేసి ఢిల్లీ చుట్టూ సీఎం, డిప్యూటీ సీఎంలు చక్కర్లు కొడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలంలో రైతు ప్రభాకర్ స్వయంగా నేను కాంగ్రెస్ కు ఓటు వేశాను అన్నారని. కానీ కోదండారెడ్డి వినిపించడం లేదాని ప్రశ్నించారు.

నిన్న కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండారెడ్డి సిగ్గుమాలిన మాటలు మాట్లాడారు. రైతు బీఆర్ఎస్ నేత ఆ పార్టీకి చెందిన వ్యక్తి అని అబద్దపు మాటలు మాట్లాడారని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి మాత్రం ఉన్నతస్థాయి విచారణ అంటాడు కానీ అతను భట్టి కి చాలా దగ్గర ఆయన ఒక జెడ్పిటిసి భర్త కూడా. రాష్ట్రంలో ఎక్కడ చూసిన రైతుల ఆత్మహత్యలు తప్ప ఇంకోటి లేదన్నారు. ప్రజావాణి కి వెళ్లి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఇప్పుడు రాష్ట్రంలో దారుణ పరిస్థితులు ఉన్నాయన్నారు. ప్రభాకర్ రైతు కుటుంభం కు 25 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి,వారి కుటుంబంలో ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని తాత మధు డిమాండ్ చేశారు.

Tags:    

Similar News