ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం

మాజీ మంత్రి హరీశ్‌ రావు

Update: 2024-09-02 09:57 GMT

భారీ వర్షాలు, వరదలతో సహాయక చర్యల కోసం ఆర్తిగా ఎదురు చూస్తున్న ప్రజలను ఆదుకోవడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌ రావు 'ఎక్స్‌' వేదికగా మండిపడ్డారు. ప్రజల ఇంట్ల వరద నీరు, కంట్లో ఎడతెగని కన్నీరు.. రాష్ట్రంలో వరద సృష్టించిన విలయాన్ని చూస్తుంటే గుండె తరుక్కుపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కొంతకాలంగా శుష్క రాజకీయాలు చేస్తోందని.. ఇకనైనా కూల్చివేతలను ఆపి బాధితులను ఆదుకోవడంపై సంపూర్ణంగా దృష్టి పెట్టాలని డిమాండ్‌ చేశారు. వరదలో చిక్కుకున్న వారికి తక్షణ సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, కరెంట్‌ సరఫరా పునరుద్దరించడంతో పాటు నిర్వాసితులకు, లోతట్టు ప్రాంతాల్లో చిక్కుకున్న వారికి ఆహారం, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. ఇప్పటికే రాష్ట్రం విష జ్వరాలతో విలవిల్లాడుతోందని.. వరదలతో అవి మరింత విజృంభించే ప్రమాముందని హెచ్చరించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖలు అప్రమత్తం కావాలని సూచించార. పంటలు నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం చెల్లించాలని సూచించారు.

Tags:    

Similar News