మహాసంకల్పం నెరవేరిన రోజు..మరో స్వప్నం సాకారమైన క్షణం: కేటీఆర్‌

ఖమ్మం జిల్లాలో కరువును శాశ్వతంగా రూపుమాపడానికి కేసీఆర్‌ ప్రభుత్వం చేపట్టిన సీతారామ ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ విజయవంతమైంది. దీనిపై కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా ఆనందాన్ని వ్యక్తం చేశారు.

By :  Raju
Update: 2024-06-27 10:21 GMT

సీతారామ ప్రాజెక్టు ను చేపట్టి ఖమ్మం జిల్లాను కరవును శాశ్వతంగా పారదోలడానికి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ప్రాణం పోశారని ఆపార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో 10 లక్షల ఎకరాల్లో పచ్చిన పంటలు పండటానికి కేసీఆర్‌ బాటలు వేశారు. శంకుస్థాపన చేసిన నాటి నుంచి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయడానికి పటిష్ట ప్రణాళికలను రూపొందించిన యుద్ధప్రాతిపదిక పనులు జరిగేలా చేశారు. ఆ ప్రాజెక్టు ట్రయల్‌ రన్‌ ఈరోజు విజయవంతమైంది.

దీనిపై కేటీఆర్‌ ఎక్స్‌ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. కేసీఆర్‌ మహా సంకల్పం నెరవేరిన రోజు, మరో స్వప్నం సాకారమైన క్షణమిది అన్నారు. సీతారామ ప్రాజెక్టు నా గుండెకాయి ఆనాడే కేసీఆర్‌ ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్‌ గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలు త్వరలోనే రైతుల పొలాల్లో పారనున్నాయని.. ఖమ్మం జిల్లాలో ప్రతి ఇంచుకు ఢోకా లేదని, దశాబ్దాల పాటు దగాపడిన రైతుకు ఇక చింతలేదన్నారు.

కాలమైనా.. కాకపోయినా పరవళ్లు తొక్కుతున్న ఈ ప్రాజెక్టు అందించే జలాలతో ఖమ్మం రైతుల జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండుతాయన్నారు. కేసీఆర్‌ కలను సాకారం చేసి, ఈ 'జల విజయం'లో భాగస్వాములైన నీటిపారుదల అధికారులను, సిబ్బందిని అభినందించారు . కష్టపడిన ప్రతి ఒక్కరికీ కేటీఆర్‌ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చెప్పారు

Tags:    

Similar News