దళిత మహిళను బట్టలు విప్పి కోట్టే పరిస్దితికి తెలంగాణ చేరింది : శ్రీనివాస్ గౌడ్

రాష్ట్రంలో నేరాలు పెరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Update: 2024-08-05 09:47 GMT

తెలంగాణలో శాంతి భద్రతలు దారుణంగా ఉన్నయని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఏ క్షణాన ఏం జరుతుందో అని ప్రజలు భయం గుపిట్లో బతుకుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ భవన్‌లో మీడియ సమావేశంలో ఆయన మాట్లాడారు. మాజీ సీఎం కేసీఆర్ హయం లో తెలంగాణ మహిళలకు భద్రత ఉండేదని కాంగ్రెస్ పార్టీ ఏనిమిది నెలల పాలనలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా విఫలమైదన్నారు. షాద్ నగర్‌లో దళిత మహిళను పోలీసులు హించించి తీరు చాలా దారుణమని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. దళిత మహిళను బట్టలు విప్పి కోట్టే పరిస్దితికి తెలంగాణ చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడ ఇలాంటి పరిస్థితి లేదన్నారు. మగ పోలీసులతో మహిళను ఎలా విచారిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నేరాల రేటు 9 శాతం పెరిగిపోయిందన్నారు ..ముఖ్యమంత్రే హోం మంత్రిగా ఉన్నారు ..ఏం సమాధానం చెబుతారని నిలదీశారు.

రాష్ట్రంలో మహిళలపై లైంగిక దాడులు, దొంగతనాలు ,హత్యలు విపరీతంగా పెరిగిపోయాయి తెలిపారు. తెలంగాణ తెచ్చుకున్నది నేరాల రేటు పెంచుకోవడానికి కాదు..నేరాలు పెరుగుతుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు. హైదరాబాద్ ,తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కోల్పోక ముందే శాంతి భద్రతల పై ప్రభుత్వం కళ్ళు తెరవాలన్నారు. షాద్ నగర్ ఘటనలో సీఐ ని సస్పెండ్ చేసినంత మాత్రాన దళిత మహిళకు న్యాయం జరగదని హితవు పలికారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇకనైనా చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఓ ఎమ్మెల్యేసాటి ఎమ్మెల్యేల తోలు తీస్తామంటున్నారు .ఇక సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటుందన్నారు. మహిళలపై దాడులకు దిగే వారి పై కఠిన చర్యలు తీసుకుంటే తప్ప భవిష్యత్ లో నేరాలు చేసే వారు అదుపు లో ఉంటారని మాజీ మంత్రి అన్నారు.

Tags:    

Similar News