తెలంగాణ అసెంబ్లీ నిరవధిక వాయిదా

తెలంగాణ శాసన సభ నిరవధికంగా వాయిదా పడ్డాయి

By :  Vamshi
Update: 2024-08-02 15:35 GMT

తెలంగాణ శాసన సభ నిరవధిక వాయిదా పడింది. సభను నిరవధకంగా వాయిదా వేస్తున్నట్లు సభాపతి గడ్డం ప్రసాద్ ప్రకటించారు. 9 రోజుల పాటు నడిచిన అసెంబ్లీలో 5 బిల్లులకు ఆమోదం తెలిపింది. 32 ప్రశ్నలపై సభలో చర్చించారు. మొత్తం 65.33 గంటల పాటు నడిచింది.

ఈ బడ్జెట్ సమావేశాలు గతంలో ఎన్నడూ లేనంత వాడివేడి వాదనలు, నిరసనలు, మార్షల్స్ రంగ ప్రవేశం, వాకౌట్‌లు, అసెంబ్లీ ఆవరణలో ప్రతిపక్ష సభ్యుల అరెస్టు, స్పీకర్ పోడియం దగ్గర ధర్నా, నేలపై కూర్చుని నిరసన, సీఎం రేవంత్‌పై సభా హక్కుల ఉల్లంఘనకు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్... ఇలా అనేక అనూహ్య పరిణామాలతో శుక్రవారం ముగిశాయి. ఉభయ సభల్లో ఐదు కొత్త బిల్లులను ప్రవేశపెట్టడం, వాటిపై చర్చల అనంతరం ఏకగ్రీవంగా ఆమోదం పొందాయి. బడ్జెట్‌, ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలతో పాటు ఆమోదం లభించింది.

Tags:    

Similar News