తెలంగాణలో టీడీపీదే అధికారం : చంద్రబాబు

తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

By :  Vamshi
Update: 2024-08-10 13:37 GMT

తెలంగాణలో కూడా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో శనివారం మధ్యాహ్నం సమావేశం నిర్వహించారు. ఇక నుంచి పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతామని తెలిపారు. దీని కోసం ప్రతి నెల రెండో శనివారం, ఆదివారం రాష్ట్రానికి వచ్చి సమీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. త్వరలో గ్రామస్థాయి నుంచి పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెడతానని అన్నారు.

15 రోజుల్లో తెలంగాణలో సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు. యువకులకు, బీసీలకు పెద్దపీట వేస్తామని అన్నారు. ప్రధానంగా పార్టీ బలోపేతంపై చంద్రబాబు నాయకులకు దిశానిర్థేశం చేశారు. టీటీడీపీలో పాత కమిటీలను రద్దు చేస్తూ చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు. పార్లమెంట్, అసెంబ్లీ సెగ్మెంట్‌ల వారిగా ఉన్న కమిటీలను రద్దు చేశారు. ఏపీ, తెలంగాణలలో ఒకేసారి కొత్త కమిటీలు ఏర్పాటు చేయాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అనంతరమే తెలంగాణ టీడీపీ నూతన అధ్యక్షుడి ఎంపిక చేస్తారని సమాచారం. అనంతరం కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు.

Tags:    

Similar News