సోమ్ డిస్టిలరీస్ మీద విచారణ జరపాలి : క్రిశాంక్

సోమ్ డిస్టిలరీస్ నుండి కాంగ్రెస్ పార్టీకి ముడుపులు ముట్టాయి

Byline :  Vamshi
Update: 2024-06-11 10:11 GMT

సీఎం రేవంత్‌రెడ్డి ఆరునెలల పాలన చూస్తుంటే తుగ్లక్ పాలన సాగిస్తున్నాడేమో అనిపిస్తోందని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. సోమ్ డిస్టిలరీస్ నుండి కాంగ్రెస్ పార్టీకి ముడుపులు అందినాయి, దీని మీద పూర్తి ఆధారాలు ఇచ్చామని ఆయన అన్నారు. ఇప్పుడు సోమ్ డిస్టిలరీస్ సంస్థను తాత్కాలికంగా నిలిపివేశారని క్రిశాంక్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి జూపల్లి కృష్ణారావు సోమ్ డిస్టలరీస్ విషయంలో అనుసరించిన వైఖరి ఆక్షేపణీయంగా ఉందన్నారు. అవినీతి గురించి ప్రశ్నించే సరికి జూపల్లి సోమ్ డిస్టలరీస్‌పై రకరకాల వైఖరులు తీసుకుని చివరకు తోకముడిచారన్నారు.

సోమ్ డిస్టలరీస్‌కు రాష్ట్రంలో మద్యం విక్రయాలకు ఇచ్చిన అనుమతి ని రద్దు చేయడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. మొదట ఎందుకు అనుమతులు ఇచ్చారనే దానిపై విచారణ జరగాలన్నారు. ఫ్రాడ్ కంపెనీ అయిన సోమ్ డిస్టలరీస్‌కి రాష్ట్రంలో అనుమతి ఇవ్వడానికి కారకులు ఎవ్వరో బయటకు రావాలన్నారు. లీకులు ఇచ్చేది ప్రభుత్వమే.. వాటిని ఎవరైనా సోషల్ మీడియాలో పెడితే అక్రమ కేసులు పెడుతోంది ప్రభుత్వమేని క్రిశాంక్ అన్నారు. అన్ని శాఖల్లో స్కాంల మీద స్కాంలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. పందికొక్కుల్లా కాంగ్రెస్ నేతలు రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News