కాంగ్రెస్‌లోకి చేరిన ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలి : నిరంజన్‌రెడ్డి

నిరుద్యోగుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి వారి సమస్యలను ఓపికగా వినే ప్రయత్నం కూడా చేయడం లేదని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు

By :  Vamshi
Update: 2024-07-06 09:28 GMT

బీఆర్‌ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్‌లోకి మారిన ఏడుగురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. ఆ నేతలకు ఎన్నికలను ఎదర్కొనే ధైర్యం లేదా అని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు సమయంలో లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేటర్ రాసినట్లు పేర్కొన్నారు. దీనిపై ఆయన స్పందించాలని కోరారు. గతంలో బీఆర్‌ఎస్ చేరికలు చట్టబద్దంగా వ్యవహరించామన్నారు. రాజ్యంగ బద్దంగా బీఆర్‌ఎస్‌లో విలీనాలు జరిగాయిని నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి బీఆర్‌ఎస్ నేతల ఇండ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారని తెలిపారు.

నిరుద్యోగుల సమస్యల విషయంలో కాంగ్రెస్ సర్కార్ గాలికి వదిలేసిందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కనీసం నిరుద్యోగుల సమస్యలను వినే ప్రయత్నం కూడా చేయడం లేదని అన్నారు. తమ సమస్యలు చెప్పుకోవడానికి నిరుద్యోగులు వస్తే.. పట్టించుకోకపోగా ఇనుప కంచెలు, ముళ్ల కంచెలు అడ్డుగా పెట్టి అరెస్టులు చేయించారని ఫైరయ్యారు. చివరికి నాంపల్లి రోడ్డులో వెళ్తున్న సామాన్య ప్రజలను, పని మీద వచ్చిన రైతులను కూడా అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాన్య ప్రజల పట్ల ప్రభుత్వ తీరు ఈ విధంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. ఇదే కొనసాగిస్తే అన్ని విషయాల్లో విఫలమవుతున్న ప్రభుత్వనికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్డెక్కుతారని నిరంజన్‌రెడ్డి హెచ్చరించారు.

Tags:    

Similar News