రేపటి నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వరుస భేటీలు : కేసీఆర్‌

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని మంగళవారం ఎర్రవల్లిలోని వారి నివాసంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు .

By :  Vamshi
Update: 2024-06-25 11:44 GMT

ఎర్రవల్లిలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. తాజాగా జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి పార్టీ మారడాన్ని పట్టించుకోవద్దని ఆయన సూచించారు. కొందరు స్వార్థపరులు పార్టీ మారినంత మాత్రన పార్టీకి వచ్చే నష్టమేమీ లేదన్నారు. వైఎస్ హయాంలో ఇలాంటివి ఎన్ని జరిగిన భయపడలేదన్నారు. భవిష్యత్తులో బీఆర్‌ఎస్‌కు మంచి రోజులు వస్తాయిని ఎవరూ తొందరపడొద్దని సూచించారు. రేపట్నుంచి వరుసగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో భేటీలు ఉంటాయని స్పష్టం చేశారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆరోపించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నదని అన్నారు. భవిష్యత్తులో మనకు‌ మంచి రోజులు వస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్‌, మాగంటి గోపీనాథ్‌, ముఠా గోపాల్‌, మాధవరం కృష్ణారావు, అరికెపూడి గాంధీ, ప్రకాశ్‌గౌడ్‌, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌ రెడ్డి, దండె విఠల్‌, మాజీ ఎమ్మెల్యేలు జోగు రామన్న, నాయకులు క్యామ మల్లేశ్‌, రావుల శ్రీధర్‌ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారితో కలిసి అధినేత కేసీఆర్‌ మధ్యాహ్నా భోజనం చేశారు

Tags:    

Similar News