పవన్‌ను వీడియో తీసిన భార్య లెజినోవా

వేదికపైనే చిరంజీవికి పవన్ పాదాభివందనం

Byline :  Vamshi
Update: 2024-06-12 07:18 GMT

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణం చేశారు. ఆ మధుర క్షణాలను ఆయన సతీమణి అన్నా లెజినోవా తన సెల్ ఫోన్‌లో బంధించారు. ఆమె ఓ వైపు ఫోటోలు తీస్తూనే మరోవైపు తన భర్త విజయాన్ని ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పవన్ ప్రమాణ స్వీకారన్నికి హాజరయ్యారు. మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేశారు. రామ్ చరణ్ రాకతో ప్రమాణ స్వీకార ప్రాంగణం వద్ద కోలాహలం నెలకొంది. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు జనాలు ఉత్సాహం చూపించారు.

"కొణిదెల పవన్ కల్యాణ్ అనే నేను" అనగానే సభ ప్రాంగణం మొత్తం ఒక్కసారిగా హోరెత్తిపోయింది. దాదాపు 10 ఏళ్లు కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని.. ఇన్ని సంవత్సరాలు వేచి చూసిన అభిమానుల కల నెరవేరిన వేళ పవన్ ఫ్యాన్స్ తో పాటు కుటుంబ సభ్యులు, జనసేన కార్యకర్తలు ఆనందంలో మునిగి పోయారు. జనసేన కార్యకర్తల సంతోషం మిన్నంటింది. చప్పట్లు, కేకలతో సభా ప్రాంగణం మార్మోగింది. పవన్ ప్రమాణస్వీకారం చేస్తుండగా ఆయన భార్య అన్నా లెజనోవా, సోదరుడు చిరంజీవి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసింది. ప్రమాణం పూర్తయ్యాక వేదికపై ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లిన పవన్ కల్యాణ్ ఆయనతో కరచాలనం చేశారు. ఈ సందర్భంగా పవన్ ను చంద్రబాబు అభినందించారు

Tags:    

Similar News