టీడీపీ స్టేట్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన పల్లా శ్రీనివాసరావు

ఏపీ తెలుగు దేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు

By :  Vamshi
Update: 2024-06-28 09:44 GMT

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు నేడు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో లాంఛనంగా బాధ్యతలు చేపట్టారు. తనపై నమ్మకం ఉంచి , పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలను అప్పగించిన చంద్రబాబు, లోకేశ్‌లకు ధన్యవాదాలు తెలిపారు. పల్లా శ్రీనివాసుకు పలువురు టీడీపీ నేతలు అభినందనలు తెలిపారు.

కింజరాపు అచ్చెన్నాయుడుకి మంత్రి పదవీ అప్పగించడం.. ఆ స్థానంలో పల్లా శ్రీనివాస్‌ను సీఎం చంద్రబాబు నియమించారు. గాజువాక నియోజకవర్గం నుంచి పల్లా శ్రీనివాసరావు రాష్ట్రంలో అత్యధిక మెజారిటీతో విజయం సాధించారు. వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పై 95,235 ఓట్ల మెజారిటీతో గెలుపు పొందారు. పల్లా బీసీ (యాదవ) సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఆయన గతంలో విశాఖ లోక్‌సభ టీడీపీ ఇన్చార్జిగా పనిచేశారు. దీంతో పల్లా పనితనం నచ్చి చంద్రబాబు పార్టీ బాధ్యతలను అప్పగించారు

Tags:    

Similar News