శాసనసభ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడు నామినేషన్‌

శాసనసభ స్పీకర్‌గా చింతకాలయ అయ్యన్నపాత్రుడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున కూటమి నేతలు నామినేషన్‌ దాఖలు చేశారు.

By :  Raju
Update: 2024-06-21 08:38 GMT

శాసనసభ స్పీకర్‌గా చింతకాలయ అయ్యన్నపాత్రుడు నామినేషన్‌ దాఖలు చేశారు. ఆయన తరఫున కూటమి నేతలు నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు లోకేశ్‌, అచ్నెన్న, పయ్యావుల కేశవ్‌, సత్యకుమార్‌ , నాదెండ్ల మనోహర్‌ లు పాల్గొన్నారు. అలాగే ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం అనంతరం శాసనసభ రేపటికి వాయిదా పడింది. 

మంత్రివర్గంలో చోటు దక్కని అయ్యన్నపాత్రుడికి కీలక పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన ను స్పీకర్‌గా నియమించేందుకు సిద్ధమయ్యారు. అలాగే కూటమి ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన జనసేకు డిప్యూటీ స్పీకర్‌ ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్టు టీడీపీ వర్గాలు తెలిపాయి. మండలి బుద్ధప్రసాద్‌, బొలిశెట్టి శ్రీనివాస్‌, లోకం మాధవి పేర్లను చంద్రబాబు పరిశీలిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఎవరికో ఒకరకి డిప్యూటీ స్పీకర్‌ పదవి దక్కే అవకాశం ఉన్నది. చీప్‌విప్‌గా దూళిపాళ్ల నరేంద్ర పేరును ఖరారు చేసినట్టు సమాచారం. 

Tags:    

Similar News