దానం నాగేంద‌ర్‌ కామెంట్స్‌ పై..ఎమ్మెల్యే కేపీ వివేకానంద కౌంట‌ర్

దానం నాగేందర్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దానం పరిధులు దాటి మాట్లాడారని వివేకానంద ఫైర్ అయ్యారు.

By :  Vamshi
Update: 2024-06-21 12:50 GMT

మాజీ మంత్రి దానం నాగేంద‌ర్‌పై కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ఫైర్‌య్యారు. బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంద‌ని దానం నాగేంద‌ర్ చేసిన కామెంట్స్‌పై కేపీ వివేకానంద స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చారు. దానం త‌న ప‌రిధి మాట్లాడుతున్నారు. దానం లాగే ఇత‌ర ఎమ్మెల్యేలు పార్టీలు మారుతారు అనుకోవ‌డం సరికాదు. మిగ‌తా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల‌ను బ‌ద్నాం చేయ‌డం సరికాదు అన్నారు. రాజ‌కీయాల్లో దానం నాగేంద‌ర్ చాప్ట‌ర్ క్లోజ్ అయిన‌ట్లే అని కేపీ స్ప‌ష్టం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ టికెట్‌పై గెలిచిన దానం నాగేంద‌ర్.. లోక్‌స‌భ ఎన్నిక‌ల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే.

సికింద్రాబాద్ ఎంపీ అభ్య‌ర్థిగా కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున దానం నాగేంద‌ర్ పోటీ చేశారు. బీజేపీ అభ్య‌ర్థి కిష‌న్ రెడ్డి చేతిలో దానం ఓట‌మి పాల‌య్యారు. ప్ర‌తిప‌క్షంలోనే ఉండి ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం చేస్తామ‌ని తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే అంటే అధికారంలో ఉండటమే కాదు. ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేనే అంటారని దానం గ్రహించాలి. రాత్రికి రాత్రి పార్టీలు, కండువాలు మార్చి సంపాదనలో పడ్డ దానం లాగా మేము పార్టీలు మారబోమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపి వివేకానంద క్లారీటీ ఇచ్చారు

Tags:    

Similar News