రాజకీయాలు పక్కన పెట్టి సహాయక చర్యలపై దృష్టి పెట్టాలి : హరీష్ రావు

రాజకీయాలు పక్కన పెట్టి సహాయక చర్యలపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని మాజీ మంత్రి హరీష్ రావు కోరారు

By :  Vamshi
Update: 2024-09-02 14:05 GMT

రాజకీయాలు పక్కన పెట్టి సహాయక చర్యలపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మాజీ మంత్రి హరీష్ రావు పలికారు. ప్రజలు ఆపదలో ఉంటే మీరు రాజకీయాలు మాట్లాడటం శోచనీయం. ప్రజల కన్నీళ్లు తుడవాల్సింది పోయి ప్రతిపక్షాల మీద విమర్శలు చేస్తున్నారు. మీలాగా మేము విమర్శలు చేయలేక కాదు. ఇలాంటి కష్టకాలంలో ప్రజలను ఆదుకోవడం ముఖ్యం. సహాయక చర్యలపై ముందు దృష్టి సారించండని హరీష్ రావు కోరారు. విపత్తు నిర్వహణలో, వరద బాధితులను ఆదుకోవడంలో మీరు పూర్తిగా విఫలం అయ్యారు. వారు మీ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా తక్షణమే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సూచిస్తున్నామని మాజీ మంత్రి పేర్కొన్నారు. వరదలొస్తే సీఎం రేవంత్ రెడ్డి సహాయం చెయ్యకుండా మాపై బురుద వేస్తున్నారు అని హరీష్ రావు అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న మాపై విమర్శలు చెయ్యడమే సీఎంకు పని. ఖమ్మం జిల్లాలో వరద సహాయక చర్యల్లో ముగ్గురు మంత్రులు ఫెయిల్ అయ్యారు. 74 ఏళ్ళు ఉన్న ఏపీ సీఎం బయట తిరుగుతుంటే, 54 ఏళ్ళు ఉన్న మన సీఎం ఇంట్లో ఉన్నాడు. వాతావరణ శాఖ చెప్పిన కూడా ముందస్తు చర్యలు చెయ్యలేదన్నారు.

Tags:    

Similar News