కేసీఆర్ పుణ్యాన రేవంత్‌‌రెడ్డి సీఎం అయ్యాడు : ఎంపీ రవిచంద్ర

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టిందని బీఆర్‌ఎస్ రాజ్య సభ పక్షనేత వద్దిరాజు రవిచంద్ర ,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు.

By :  Vamshi
Update: 2024-08-15 14:29 GMT

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవాన్ని దిల్లీలో తాకట్టు పెట్టిందని బీఆర్‌ఎస్ రాజ్య సభ పక్షనేత వద్దిరాజు రవిచంద్ర ,మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణేతర వ్యక్తి అభిషేక్‌ మను సింఘ్వి పేరు రాజ్యసభ ఎంపీ సీటు కేటాయించడంపై కాంగ్రెస్ అధిష్ఠానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణకు చెందిన నేతలు అధిష్ఠానానికి కనిపించడం లేదా అంటూ ధ్వజమెత్తున్నారు. అధిష్ఠానం పెద్దలు తెలంగాణ కాంగ్రెస్ నేతలను కీలుబొమ్మల్లా ఆడిస్తున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యసభ సభ్యత్వానికి కేకే రాజీనామా చేస్తే ఆ పార్టీ తరఫున అభ్యర్థిగా నిలబెట్టేందుకు వీహెచ్ సహా బీసీ, ఎస్సీ, మైనార్టీ నాయకులు వారికి కనిపించలేదా అంటూ ప్రశ్నించారు.

తెలంగాణ విషయంలో అభిషేక్ సింఘ్వి ఏ రోజూ సానుకూలంగా స్పందించలేదని, అలాంటి వారికి ఎలా సీటు కేటాయిస్తారని వద్దిరాజు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అర్హులు లేనట్లు ఢిల్లీ నేతకు రాజ్యసభ సీటు ఇవ్వడం తెలంగాణ ప్రజలను అవమానించడమే అని అన్నారు. ఐదు బీసీ సామాజిక వర్గాలు, ముస్లింలకు మంత్రి పదవులు ఇవ్వలేదన్నరు. కేసీఆర్ తెలంగాణ తెచ్చినందుకే రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు, కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి అయ్యారని రవిచంద్ర అన్నారు.తెలంగాణ వ్యతిరేకులకు ఇక్కడ నుంచి పదవులు ఇవ్వడం బాధ కలిగిస్తోందన్నారు. తెలంగాణ వారికి లేదా తెలంగాణకు అనుకూలంగా ఉన్న వారికి అవకాశం ఇవ్వండని శ్రీనివాస్ గౌడ్ అన్నారు.

Tags:    

Similar News