మరో గంటలో తిహార్‌ జైలు నుంచి కవిత విడుదల

రౌస్‌ అవెన్యూ కోర్టులో ష్యూరిటీలు అందజేసిన కవిత భర్త అనిల్‌, ఎంపీ వద్దిరాజు

Update: 2024-08-27 12:28 GMT

ఢిల్లీ లిక్కర్‌ కేసులో 165 రోజులుగా విచారణ ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ కవిత మరో గంట సేపట్లో విడుదల కానున్నారు. సుప్రీం కోర్టు ఆమెకు బెయిల్‌ మంజూరు చేయడంతో దానికి అవసరమైన ఫార్మాలిటీస్‌ పూర్తి చేశారు. ఎమ్మెల్సీ కవిత భర్త అనిల్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మంగళవారం మధ్యాహ్నం ష్యూరిటీ బాండ్లను రౌస్‌ అవెన్యూ కోర్టులో సమర్పించారు. ష్యూరిటీలు స్వీకరించిన రౌస్‌ అవెన్యూ కోర్టు కవిత రిలీజ్‌ ఆర్డర్‌ జారీ చేశారు. దీనికి సంబంధించిన ప్రాసెస్‌ తిహార్‌ జైలు అధికారులు రెండు గంటల్లో పూర్తి చేస్తారు. సాయంత్రం 7 గంటలకు ఆమె జైలు నుంచి విడుదలవుతారు. ఇప్పటికే మాజీ మంత్రులు గంగుల కమలాకర్‌, శ్రీనివాస్‌ గౌడ్‌ సహా పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు తిహార్‌ జైలుకు చేరుకున్నారు. మరికాసేపట్లోనే మాజీ మంత్రులు కేటీఆర్‌, హరీశ్ రావు కూడా జైలుకు చేరుకోనున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత మంగళవారం రాత్రి కవిత ఢిల్లీలోనే బస చేస్తారు. బుధవారం ఉదయం 11.30 గంటల సమయంలో ఆమె ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ కు బయల్దేరుతారు. మధ్యాహ్నం 2.45 గంటలకు ఆమె శంషాబాద్‌ ఎయిర్‌ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి బంజారాహిల్స్‌ లోని తన నివాసానికి వెళ్తారు.

Tags:    

Similar News