రాజకీయ కక్షతోనే కవితను జైళ్లో పెట్టారు : కేసీఆర్

తాను అగ్నిపర్వతంలా ఉన్నానని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశమైంది.

By :  Vamshi
Update: 2024-07-23 15:23 GMT

రాజకీయ కక్షతోనే నా కూమార్తెను జైళ్లో పెట్టారని మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. సొంత బిడ్డ జైళ్లో ఉంటే కన్న తండ్రిగా నాకు బాధగా ఉండదా.. ప్రస్తుతం నేను సలసల మరిగిపోయే అగ్ని పర్వతంలా ఉన్నానని కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక, ఎమ్మెల్యేలు వరుసగా పార్టీ వీడటంతో బీఆర్ఎస్ క్లిష్ట పరిస్థితుల్లో ఉందన్న వ్యాఖ్యలకు సైతం గులాబీ బాస్ కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్‌ పార్టీకి క్లిష్ట పరిస్థితులు ఏమి లేవని, ఇంతకంటే ఇబ్బందికర పరిస్థితుల్లోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాను అగ్నిపర్వతంలా ఉన్నానని బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్‌ అధ్యక్షతన బీఆర్‌ఎస్‌ ఎల్పీ సమావేశమైంది.

ఎమ్మెల్సీలు, ఎమ్మెల్సీలకు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్‌ నేపథ్యంలో శాసనభలో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. మండలిలో బీఆర్‌ఎస్‌ పక్షనేతగా మధుసూదనాచారిని నియమించారు అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా కాంగ్రెస్ పాలనపై పట్టు సాధించలేకపోయిందన్నారు. పాలనపై దృష్టి పెట్టకుండా గత ప్రభుత్వాన్ని అభాసుపాలు చేసే పనిలోనే ఉన్నారని చురకలంటించారు. మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో శాంతిభద్రతలు ఎందుకు తప్పుతాయని నిలదీశారు. ఎక్కడో ఉన్న వారిని చేరదీసి మంచి నేతలను చేసి పదవులు ఇస్తే.. వాళ్లు మాత్రం పదవులు అనుభవించి పార్టీ వీడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ వదిలి వెళ్లే వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని కేసీఆర్ పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు.

Tags:    

Similar News