బీఆర్ఎస్ పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన కార్తిక్ రెడ్డి

బీఆర్ఎస్ పార్టీని నేను పార్టీ మారను, మా అమ్మ పార్టీ మారదని కార్తిక్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు.

By :  Vamshi
Update: 2024-07-05 09:05 GMT

కాంగ్రెస్ పార్టీ బిఫామ్ మీద గెలిచిన మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు ఖమ్మం టీడీపీ ఆఫీసులో సంబరాలు చేసుకున్నారని బీఆర్‌ఎస్ యువ నాయకుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ బీజేపీలు రాష్ట్రం లో కలిసి పని చేస్తున్నాయి అనడానికి ఇంత కన్నా నిదర్శనం ఏమి కావాలి ఆయన ప్రశ్నించారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. నేను పార్టీ మారను, మా అమ్మ పార్టీ మారదని కార్తిక్‌రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఆ రోజు ప్రత్యేక పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుండి మారాం కానీ రాజకీయ అవసరాల కోసం, పనుల కోసం మారలేదని స్పష్టం చేశారు.

మా ఆడ బిడ్డ ఎమ్మెల్సీ కవిత జైలు లో ఉండి 120 రోజులు దాటిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిజంగా మేము బీజేపీతో కాం ప్రమైజ్ చేసుకొని ఉంటే కవిత ఇంకా ఎందుకు జైలులో ఉంటుందని అడుగుతున్నా అని ప్రశ్నించారు కార్తీక్ రెడ్డి. ఇక పై పార్టీ మారుతామని ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తా అంటున్న లోక్ సభ ప్రతిపక్షనేత గాంధీ కి 10 షెడ్యూల్ లో ఏముందో తెలియనట్టు ఉన్నదాని కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో విచిత్రమైన రాజకీయాలు నడుస్తున్నాయని కాంగ్రెస్ పార్టీ వేసిన విద్యుత్ కమిషన్ కు బిజెపి సపోర్ట్ చేస్తూ బీఆర్‌ఎస్ అధినేత కెసిఆర్ ను టార్గెట్ చేశారని కార్తీక్‌రెడ్డి అన్నారు.

Tags:    

Similar News