జర్ఖండ్ ముఖ్యంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం

జర్ఖండ్ సోరెన్ సీఎంగా మళ్లీ హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు.

By :  Vamshi
Update: 2024-07-04 11:48 GMT

జర్ఖండ్ ముఖ్యంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు. నిన్న చంపై సోరెన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఐదు నెలల జైలు జీవితం తర్వాత జార్ఖండ్ ముక్తి మోర్చా నాయకుడు హేమంత్ సోరెన్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. హేమంత్ సోరెన్‌కు భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ హైకోర్టు జూన్ 28న బెయిల్ మంజూరు చేయడంతో జైలు నుండి విడుదలయ్యాడు. జేఎంఎం నేతృత్వంలోని కూటమి హేమంత్‌ను శాసనసభా పక్ష నేతగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది.

Tags:    

Similar News