ప్రధాని మోదీకి షాక్..బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ డిమాండ్

జేడీయూ పార్లమెంటరీ సమావేశంలో ప్రత్యేక హోదాపై కీలక తీర్మానం చేశారు

By :  Vamshi
Update: 2024-06-29 10:26 GMT

కేంద్రంలోని ఎన్డీయే సంకీర్ణ సర్కార్‌లో భాగస్వామిగా ఉన్న నితీశ్‌కుమార్ ప్రధాని మోదీకి మెలిక పెట్టారు. బిహార్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని జేడీయూ సమావేశంలో కీలక తీర్మానం చేశారు. ఇందులో బీహార్‌కు ప్రత్యేక హోదా లేదా ఆర్థిక ప్యాకేజీని ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తీసుకువచ్చిన తీర్మానాన్ని పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించింది. అలాగే, ప్రశ్నాపత్రాల లీకేజీ కేసులో నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేసింది. పరీక్షల్లో అక్రమాలను నివారించేందుకు పార్లమెంట్‌లో ప్రత్యేక, కఠినచట్టం చేయాలని కోరింది.

పార్టీ సమావేశం అనంతరం జేడీయూ నేత ఒకరు మాట్లాడుతూ... బీహార్‌కు ప్రత్యేక హోదా డిమాండ్ కొత్తదేమీ కాదన్నారు. రాష్ట్ర వృద్ధి పథాన్ని వేగవంతం చేయడం, సవాళ్లను పరిష్కరించడంలో ఇది కీలకమైన దశ అన్నారు. బీహార్‌లో ఇటీవల 65 శాతానికి పెంచిన రిజర్వేషన్ కోటాను కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను కూడా ఈ తీర్మానంలో పేర్కొన్నారు. న్యాయపర పరిశీలన, రక్షణ కోసం రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్‌లో రిజర్వేషన్‌ కోటాను చేర్చాలని జేడీయూ ప్రతిపాదించింది. అలాగే ఈ కోటాను నిరంతరాయంగా అమలు చేస్తామని జేడీయూ హామీ ఇచ్చింది. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు, బిహార్ హైకోర్టు స్టే విధించిందిన సంగతి తెలిసిందే. కాగా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంపీ సంజయ్ ఝూను పార్టీగా ఎన్నుకుంది

Tags:    

Similar News