గాంధీ భవన్‌లో అటెండర్ ఉద్యోగం ఇచ్చినా.. చేస్తా :జగ్గారెడ్డి

పీసీసీ పదవి ఎవరికి కట్టబెట్టినా తనకు అభ్యంతరం లేదని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.

By :  Vamshi
Update: 2024-06-28 15:37 GMT

కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తనకు అటెండర్ ఉద్యోగం ఇచ్చినా చేస్తాన్నారు. పీసీసీ పదవి ఎవరికి కట్టబెట్టినా తనకు అభ్యంతరం లేదని అన్నారు. కానీ ఈ పదేళ్లలో ఎప్పుడో ఒకసారి పీసీసీ పదవి చేపడుతాన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని మనుసులో మాట చెప్పారు. గతంలో రేవంత్ రెడ్డికి పదవి ఇచ్చినప్పుడు కూడా సహకరించామని చెప్పారు.

సోనియా, రాహుల్ మాట జవదాటనని చెప్పారు. కానీ రాజకీయాల్లో ప్రధాని మోదీది తాత్కాలిక పవరే అని బీజేపీ వారు గుర్తించాలన్నారు. ప్రధానిగా ఆయన దిగిపోయాక బీజేపీలోనే పవర్ ఉండదన్నారు. ప్రజలు మూడోసారి చాలా కష్టంగా ఎన్డీయేకి అధికారం అప్పగించారన్నారు.గత పదేళ్లలో తాను ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని అంగీకరించి... ఇప్పుడైనా వాటిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. గోద్రా అల్లర్లు, పుల్వామా ఘటనలపై పార్లమెంట్‌లో చర్చించే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు.

Tags:    

Similar News