ఢిల్లీలో ముగిసిన జగన్ ధర్నా..మద్దతు తెలిపిన పలువురు ఎంపీలు

ఏపీలో కూటమి ప్రభుత్వంలో విపక్ష పార్టీ నేతలను టార్గెట్‌ చేసి దాడులు చేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ అన్నారు.

By :  Vamshi
Update: 2024-07-24 11:24 GMT

ఏపీలోని తమ కార్యకర్తలపై దాడులకు నిరసనగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ధర్నా ముగిసింది. మాజీ సీఎం నిరసనకు ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, శివసేన (ఉద్ధవ్) ఎంపీలు ప్రియాంక చతుర్వేది, సంజయ్ రౌత్, అన్నాడీఎంకే ఎంపీ తంబిదొరై, టీఎంసీ ఎంపీ నదీముల్ హక్, ఎస్పీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్, ఇండియన్ ముస్లిం లీగ్ ఎంపీ వాహబ్ తదితరులు మద్దుతు తెలిపినట్లు వైసీపీ ట్వీట్ చేసింది.. ఇండియా కూటమిలోని అన్ని పార్టీలు మీకు మద్దతుగా నిలుస్తాయి. ఇది ఏపీలో మాత్రమే జరుగుతున్న హింస కాదు, మీ పార్టీ కార్యకర్తలు మాత్రమే ఇలాంటి దారుణాలు ఎదుర్కొనడంలేదు.. దేశమంతా ఇలాగే జరుగుతోంది.ఏపీలో జరుగుతున్న హింసాత్మక పరిణామాల పట్ల గవర్నర్ జోక్యం చేసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా సుమోటోగా స్వీకరించి విచారణ జరపాలి.

ఏపీ ప్రజల వెంట మేముంటాం, వారి పోరాటానికి మేం మద్దతు పలుకుతాం" అని ప్రియాంక చతుర్వేది భరోసా కల్పించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిక 45 రోజుల్లోనే 35 రాజకీయ హత్యలు జరిగాయని అధినేత జగన్ ఆరొపించారు. ఇళ్లను ధ్వంసం చేశారు. ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తుల్ని ధ్వంసం చేశారు. వెయ్యికి పైగా అక్రమ కేసులో పెట్టారు. శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని ప్రశ్నించారు. ఏపీలో లోకేష్‌ రెడ్‌ బుక్‌ రాజ్యాంగం నడుస్తోంది. ఏపీలో లోకేష్‌ రెడ్‌ బుక్‌ హోర్డింగ్స్‌ పెట్టారు. పోలీసులు రెడ్‌ బుక్‌ రాజ్యాంగం ప్రకారమే నడుచుకుంటున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతికార చర్యలను ప్రోత్సహించలేదన్నారు. ఏకంగా మా పార్టీ ఎంపీ, మాజీ ఎంపీపైనే దాడి చేశారు. దాడులు చేసి, తిరిగి బాధితులపైనే కేసులు బనాయిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

Tags:    

Similar News