హైకోర్టును ఆశ్రయించిన జగన్.. ఆహోదా కోసమే ?

వైసీపీ అధినేత జగన్ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ అసెంబ్లీలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించాలని మంగళవారం నాడు హైకోర్టులో జగన్ పిటిషన్ దాఖలు చేశారు.

By :  Vamshi
Update: 2024-07-23 12:06 GMT

వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా స్పీర్‌ను ఆదేశించాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ప్రతిపక్ష హోదా కోసం స్పీకర్ అయ్యన్నపాత్రుడుకు లేఖ రాసిన ఇవ్వలేదని అందులో పేర్కొన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 11 సీట్లే రావడంతో ప్రతిపక్ష నేతగా జగన్‌కు అర్హత లేదని తెలుగు దేశం పార్టీ చెబుతోంది. ప్రతిపక్షంలో ఎక్కువ మంది సభ్యులు ఎవరికి ఉంటే వారికి ప్రతిపక్ష హోదా ఉంటుందని అన్నారు.

ఏపీ అసెంబ్లీలో సాంప్రదాయాలను పాటించాల్సి ఉందని చెప్పారు. 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సంచలన విజయం సాధించిన వైసీపీకి 2024 ఎన్నికల్లో మాత్రం 11 సీట్లే వచ్చిన విషయం తెలిసిందే. దీంతో వైసీపీకి విపక్ష హోదా లభించే అవకాశం లేకుండా పోయింది. ప్రతిపక్ష నేత హోదా కల్పించాలని జగన్ అంటుండగా, టీడీపీ-జనసేన-బీజేపీ సర్కారు నుంచి దీనిపై ఇప్పటికీ స్పందన రాలేదు. దీంతో జగన్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. స్పీకర్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి, అసెంబ్లీ కార్యదర్శిని ప్రతివాదులుగా చేరుస్తూ పిటిషన్ వేశారు.

Tags:    

Similar News