ఎమ్మెల్యే సంజయ్ హస్తం పార్టీలో చేరడం అనైతికం : ఎల్ రమణ

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ తన వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీ మారని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ ఎల్ రమణ అన్నారు

By :  Vamshi
Update: 2024-06-24 10:49 GMT

జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై బీఆర్‌ఎస్‌ శ్రేణులు భగ్గుమన్నాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి అన్ని విధాల లబ్ధిపొంది ఎమ్మెల్యేగా గెలిచాక వ్యక్తిగత ప్రయోజనాలు కోసం పార్టీ మారడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా సంజయ్‌ దిష్టిబొమ్మలను తగులబెట్టారు. వెంటనే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. సంజయ్ చేరికపై కాంగ్రెస్. బీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో చేరికపై ఎమ్మెల్సీ ఎల్ రమణ ఫైర్ అయ్యారు. ఆయన హస్తం పార్టీలో జాయిన్ కావడం ప్రజాస్వామ్యంలో అనైతికమని అన్నారు.

పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్నారు. పార్టీ ఫిరాయింపులు చట్టం అమల్లోకి తెస్తామని రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో చెప్పారని ఎల్ రమణ అన్నారు. పార్టీలో రాహుల్ గాంధీ మాటకు విలువ లేదా? అని ప్రశ్నించారు. తెలంగాణలో ఉన్నది రేవంత్ కాంగ్రెస్ పార్టీనా? లేక ఇందిరా కాంగ్రెసా? అని నిలదీశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ కండువా కప్పుతున్నారని.. ఇది నీతి మాలిన చర్య అని పేర్కొన్నారు. దీనికి రాహుల్ ఏం సమాధానం చెబుతారని రమణ ప్రశ్నించారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చేనేతల ఆత్మహత్యల పై చర్చ జరగాలని ఎల్ రమణ డిమాండ్ చేశారు. అసెంబ్లీ లో నేత కార్మికుల అంశం పై బీఆర్ఎస్ రేవంత్ ప్రభుత్వాన్ని నిలదీస్తుందాన్నారు.తక్షణమే ఉన్నత స్థాయి సమావేశం ఎర్పాటు చేసి వస్త్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించాలి రమణ డిమాండ్ చేశారు.

2023 శాసన సభ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ టికెట్‌పై గెలిచిన ప‌లువురు ఎమ్మెల్యేలు పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుకున్న సంగ‌తి తెలిసిందే. ప్రజల తీర్పుకు వ్యతిరేకంగా తమ పార్టీని వీడి హస్తం పార్టీలో చేరుతున్న ఎమ్మెల్యేల అనర్హత విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాల‌ని బీఆర్ఎస్ పార్టీ నిర్ణ‌యించిన‌ట్లు స‌మాచారం.ఇప్పటికే ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌లో చేరి మూడు నెలలు పూర్తికావొస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు న్యాయ నిపుణులతో బీఆర్ఎస్ పార్టీ చర్చించింది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు ప్రకారం మూడు నెలల్లో అనర్హత పిటిషన్ పైన స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని నిబంధన ఉన్నది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని పేరా నెంబర్ 30, 33 ప్రకారం హైకోర్టు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈనెల 27వ తేదీన హైకోర్టులో దానం నాగేందర్ అనర్హత అంశంపైన విచారణ ఉన్నది.

Tags:    

Similar News