గురుకుల దివ్యాంగుల ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు : వాసుదేవ రెడ్డి

డిసేబుల్డ్ కేటగిరిలో రిజెక్ట్ చేసిన ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని బీఆర్‌ఎస్ నేత వాసుదేవ రెడ్డి డిమాండ్ చేశారు.

By :  Vamshi
Update: 2024-07-01 10:37 GMT

గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను మేము ఇస్తున్నట్లుగా సీఎం రేవంత్‌రెడ్డి గొప్పలు చెప్పుకుంటున్నారని దివ్యాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ వాసుదేవ రెడ్డి అన్నారు. తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ నేత మన్నె గోవర్ధన్‌తో కలిసి మీడియంతో మాట్లాడారు. గురుకుల ఉద్యోగుల ఉద్యోగాల భర్తీలో అనేక అవకతవకలు జరిగాయన్నారు. రిజర్వేషన్‌లలో గందరగోళం జరిగిందని అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారని అన్నారు. వికలాంగుల కోటా కింద కొంతమందిని అపాయింట్మెంట్ చేశారని పేర్కొన్నారు.

స్పెషల్ కేటగిరి, డిసేబుల్డ్ కేటగిరి కింద ఉద్యోగం ఇచ్చేవారికి ముందుగానే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేయాలని తెలిపారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి హడావిడిగా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇచ్చారు. మెగా డీఎస్సిలో 25 వేల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి 11 వేలకు నోటిఫికేషన్లు ఇచ్చారన్నారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఏమైందని సీఎం రేవంత్‌ని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి పరీక్ష నిర్వహిస్తే..రేవంత్ రెడ్డి ప్రభుత్వం నియామక పత్రాలు ఇచ్చిందని ఎద్దేవా చేశారు.

అపాయ్ మెంట్ ఆర్డర్స్ వచ్చినవారు జాయినింగ్ కోసం వెళ్తే ఉద్యోగం లేదని అంటున్నారని చెప్పారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఉద్యోగ నియామకం చేయాలని నిబంధనలు ఉన్నాయని.. కానీ స్వయంగా సీఎం రేవంత్ చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకున్న వారికి సర్టిఫికెట్ వెరిఫికేషన్‌లో తిరస్కరిస్తున్నారని.. అలా 36మంది అభ్యర్థులను సర్టిఫికెట్ వెరిఫికేషన్లో తిరస్కరించారని తెలిపారు. జాబ్ వచ్చిందని సంబరపడ్డవారు ఇప్పుడు బాధపడుతున్నారని తెలిపారు. తప్పు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని వాసుదేవరెడ్డి కోరారు.

Tags:    

Similar News