టెండర్ లేకుండా కోట్ల రూపాయల కాంట్రాక్టు ఎలా ఇచ్చారు : క్రిశాంక్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయ‌న కేబినెట్‌లోని మంత్రులంద‌రూ ఏది అడిగినా త‌మ‌కు తెలియ‌దు, సంబంధం లేదు అంటున్నారని బీఆర్‌ఎస్ నేత మ‌న్నె క్రిశాంక్ అన్నారు.

By :  Vamshi
Update: 2024-06-28 10:29 GMT

తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు షాడోలుగా చెలామణి అవుతున్నరని బీఆర్ఎస్ పార్టీ సోష‌ల్ మీడియా క‌న్వీన‌ర్ మ‌న్నె క్రిశాంక్ మండిపడ్డారు. ఆయన తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. మంత్రులకు సొంత శాఖలో జరిగే విషయాలు తెలియక పోవడం సిగ్గు చేటున్నారు. కేబినేట్ మంత్రులంద‌రూ ఏది అడిగినా త‌మ‌కు తెలియ‌దు, సంబంధం లేదు అంటున్నారు. ఇది ప్ర‌జా పాల‌నా..? తుగ్ల‌క్ పాల‌నా ఆయన ప్రశ్నించారు. ప్ర‌స్తుత సీఎం, మంత్రుల ప‌రిస్థితిని చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని క్రిశాంక్ అన్నారు.

ఏయే రాష్ట్రాలకు వెళ్లారు , ఏ అధికారులను కలిశారు , వాళ్ళు ఎం డీటెయిల్స్ ఇచ్చారు అని ఆర్టీఐ ద్వారా సమాచారం కోరితే ఆర్టీసీ అధికారుల సింపుల్ గా ఆర్టీసీ టిక్కెటింగ్ మెషిన్ల కాంట్రాక్టు పై మేం వివరణ ఇవ్వలేము, అది మా పరిధిలో లేదు అన్నారు. త‌న సోష‌ల్ మీడియాలో పెడుతారు. ఇవి ఇట్ల ఉంటే.. ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కోట్ల రూపాయాల ఆర్టీసీ టికెటింగ్ కాంట్రాక్ట్ గురించి స‌మాచారం లేదంటున్నారు. ఈ ప‌రిణామాల‌ను చూస్తుంటే రేవంత్‌రెడ్డి న‌డిపిస్త‌లేదు. తుగ్ల‌క్ పాల‌న‌లా క‌న‌బ‌డుతుంది. ఏ విష‌యం అడిగినా మాకు తెల్వ‌ద‌ని మంత్రులు అంటున్నారు. మ‌రి ఎలా న‌డుస్తుంది ప్ర‌భుత్వం అని మ‌న్నె క్రిశాంక్ ప్ర‌శ్నించారు.

Tags:    

Similar News