ఆదివాసీ మహిళపై లైంగికదాడి... బండి సంజయ్ ఆరా

తెలంగాణ డీజీపీ జితేందర్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనుర్‌లో ఆదివాసీ మహిళపై ఆటోడ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడి ఘటనపై ఆరా తీశారు.

By :  Vamshi
Update: 2024-09-04 13:22 GMT

తెలంగాణ డీజీపీ జితేందర్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ ఫోన్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా జైనుర్‌లో ఆదివాసీ మహిళపై ఆటోడ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడి ఘటనపై ఆరా తీశారు. ఈనెల 31న జైనూర్ మండలం దేవుగూడకు చెందిన ఆదివాసీ మహిళ పై ఆటోడ్రైవర్ షేక్ మగ్దూం లైంగిక దాడికి యత్నించడంతోపాటు తీవ్రంగా గాయపర్చడంతోపాటు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించినట్లు వార్తలు వచ్చియి. ఈ నేపథ్యంలో డీజీపీకి ఫోన్ చేసిన బండి సంజయ్ ఆదివాసీ మహిళ కేసు పూర్వాపరాలను, ఘటన జరిగిన వెంటనే చర్యలు తీసుకోకపోవడానికి గల కారణాల అడిగి తెలుసుకున్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు.

మరోవైపు ఈ ఘటన నేపధ్యంలో ఆసిఫాబాద్‌లో జైనుర్‌ బంద్‌కు ఆదివాసీలు బంద్‌కు పిలుపునివ్వడం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.నిందితుడిపై లైంగికదాడి, హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసినట్టు ఆసిఫాబాద్‌ డీఎస్పీ సదయ్య, జైనూర్‌ సీఐ రమేశ్‌ తెలిపారు. ఆదివాసీ మహిళపై లైంగికదాడి, హత్యాయత్నానికి పాల్పడిన షేక్‌ మగ్దూంను బహిరంగంగా ఉరి తీయాలని ఆదివాసీ సంఘాల జేఏసీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కనకయాదవ్‌రావ్‌ డిమాండ్‌ చేశారు.

Tags:    

Similar News