జీహెచ్ఎంసీ ఆదాయం కొడంగల్‌కు మళ్లుతున్నాయి : వెంకటరమణారెడ్డి

జీహెచ్ఎంసీలో వచ్చే ఆదాయం సీఎం, డిప్యూటీ సీఎం నియోజక వర్గలకు మళ్లుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు

By :  Vamshi
Update: 2024-08-03 14:34 GMT

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే ఆదాయం సీఎం రేవంత్ రెడ్డి కోడంగల్, డిప్యూటీ సీఎం భట్టి నియోజక వర్గం మధిరలకు ఎందుకు దారి మళ్లుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. జీహెచ్ఎంసీలో వచ్చే నిధులు జీహెచ్ఎంసీ పరిధిలోనే ఖర్చు చేశాలని డిమాండ్ చేశారు. జీహెచ్ఎంసీలో 500 కోట్ల యాడ్ ప్రకటనల అవినీతి జరిగిందన్నారు. కేంద్ర మంత్రులను కలిసిన రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డీ నీ ఎందుకు కలవలేదు..? అసెంబ్లీ లో కిషన్ రెడ్డి గురుంచి మాట్లాడడం అయన అవకాశవాదానికి నిదర్శనమని రమణారెడ్డి అన్నారు.

తాజాగా శనివారం బల్దియా కాంట్రాక్టర్లుతో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి చర్చలు జరిపారు. చర్చల అనంతరం తాత్కాలికంగా ఆందోళన విరమిస్తున్నట్లు కాంట్రాక్టర్లు తెలిపారు. పెండింగ్‌లో ఉన్న రూ.1500 కోట్ల బిల్లులను దశలవారీగా చెల్లిస్తామని ఆమ్రపాలి వారికి హామీ ఇచ్చారు. కాగా, ఈనెల 5వ తేదీలోగా బకాయిలను చెల్లించకుంటే జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్స్‌ యాక్షన్‌ కమిటీ ఆధ్వర్యంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించడంతో ఆమ్రపాలి రంగంలోకి దిగి కాంట్రాక్టర్లతో చర్చలు జరిపారు.

Tags:    

Similar News