కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో తెలంగాణకు అన్యాయం : కార్తీక్ రెడ్డి

కేంద్రం నుండి రాష్ట్రాలకు వచ్చే నిధుల అంశంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ యువ నాయకుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి అన్నారు.

By :  Vamshi
Update: 2024-08-30 09:22 GMT

కేంద్రం నుండి రాష్ట్రాలకు వచ్చే నిధుల అంశంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని బీఆర్‌ఎస్ యువ నాయకుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి అన్నారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రానికి నిధులు రాకపోవడం కాంగ్రెస్ పార్టీ వైఫల్యమని పేర్కొన్నారు. 2500 కోట్ల కన్సాలిడేటెడ్ ఫండ్ నిధులు తెలంగాణ నుంచి ఆంధ్ర రాష్ట్రానికి వెళ్లాయిని దీని పై సీఎం రేవంత్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.

తెలంగాణ నుంచీ పొరపాటున గతంలో ఏపీకి బదిలీ అయిన 450 కోట్లు తిరిగి తెలంగాణకు రప్పించే శక్తి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదాన్నారు. హైడ్రా తో రాష్ట్రంలో ఒరిగేది ఏమి లేదుని కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు. ఓఆర్ఆర్ లోపలి పరిధి చెరువుల్లో గత కొన్నేళ్లుగా ఇండ్లు కట్టుకున్నవారుఇప్పుడు వారంతా ఎల్‌ఆర్ఎస్ కడుతున్నారు వాళ్ళ ఇండ్లు కూడా కూలుస్తారా సమాధానం చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

Tags:    

Similar News