కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం : మాజీ ఎంపీ బోయినపల్లి

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై తెలంగాణ కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు.

By :  Vamshi
Update: 2024-07-23 09:13 GMT

కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 2 గంటల ప్రసంగంలో తెలంగాణ పదాన్ని ప్రస్తావించలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై..తెలంగాణ కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీలు కేంద్రాన్ని గట్టిగా నిలదీయాలని ప్రశ్నించాలని వినోద్‌కుమార్ కోరారు. ఏపీలో పోలవరాన్ని పూర్తి చేస్తామంటున్న కేంద్రప్రభుత్వం తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణ హామీలు అమలు చేయాలన్నారు. తెలంగాణకు ఐఐఎం, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు కర్మాగారం వెంటనే ప్రకటించాలని కోరారు.

ప్రధాని మోదీకి చంద్రబాబు, నితీష్‌కుమార్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు, ఇద్ద‌రు కేంద్ర మంత్రులు ఒక్క మాట కూడా పార్లమెంట్‌లో మాట్లాడ‌లేదు. ఇదే గులాబీ కండువా కప్పుకున్న ఎంపీలు పార్లమెంట్‌లో గనుక ఉంటే కేంద్ర వ్యతిరేక వైఖరిని గట్టిగా వ్యతిరేకించే వాళ్ళు. 8 మంది ఎంపీలను ఇచ్చినా బీజేపీ ప్రభుత్వం గుడ్ను సున్నా నిధులు ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలు తప్పకుండా బుద్ధి చెప్తారు. ఆంధ్రప్రదేశ్‌కు నిధులు ఎక్కువ ఇచ్చినందుకు మాకు ఏం బాధ లేదు. సోదర రాష్ట్రంగా వారికి వచ్చిన కేటాయింపులపైన, వారు బాగుండాలని కోరుకుంటున్నాం.ఆంధ్రప్రదేశ్, బీహార్‌కు మాత్రమే ఇచ్చి మిగిలిన 26 రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నిజంగా బాధాకరమన్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం పేరు చెప్పిన మీరు తెలంగాణ రాష్ట్ర డిమాండ్లను మాత్రం పట్టించుకోలేదు అని బోయినపల్లి తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం చేశారు

Tags:    

Similar News