కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమే : జగదీష్ రెడ్డి

ఎన్నికల ముందు కాళేశ్వరం అంతా కొట్టుకుపోయిందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ప్రచారమంతా తప్పని తెలిపోతుందని మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు

By :  Vamshi
Update: 2024-07-26 10:31 GMT

కాళేశ్వరం పై కాంగ్రెస్ చేసిందంతా దుష్ప్రచారమే అని మాజీమంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.రైతాంగానికి అందించేందుకు పుష్కలంగా నీళ్లు ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డికి ఇంత నిర్లక్ష్యం తగదని ఆయన అన్నారు. ఇప్పుడు నీళ్లు ఇస్తే కాంగ్రెస్ పార్టీ నాయకుల బాగోతం బయటపడతదనే భయపడుతున్నారన్నారు. ప్రస్తుతం 10 లక్షల క్యూసెక్కుల ప్రవాహం ఉన్నది..గతంలో 28 లక్షల క్యూసెక్కులకు పైగా నీరు రావడం జరిగిందని వాస్తవం అని జగదీష్ రెడ్డి అన్నారు. అంత ప్రవాహం ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు చెక్కుచెదరలేదు..

ఒక్క గేటు కొంత కుంగితేనే కాంగ్రెస్ ఎంతో దుష్ప్రచారం చేసి రాక్షసానందం పొందిందన్నారు. ఇప్పుడు నీళ్లు ఇచ్చేందుకు ఎలాంటి సమస్యలేదంటున్నరు..అయినా రేవంత్ ప్రభుత్వం ప్రజల్లో అబాసుపలువుతామని బయపడుతున్నరు..అసలు మనకు నీళ్లొచ్చే కన్నెపల్లి పంప్ హౌజ్ కాలేశ్వరానికి 20 కి.మీ పైన ఉన్నది.. అది ఎప్పటికీ లిఫ్ట్ చేస్తనే ఉంటది..కాళేశ్వరం ప్రాజెక్టు గేట్లకు.. మనకు నీళ్లిచ్చే కన్నెపల్లి కు ఎత్తిపోయడానికి సంబంధమే లేదు..సంబంధం లేని సాకులతో ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తుందన్నారు.. కాళేశ్వరం పై చేసిన దుష్ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతాంగానికి క్షమాపణ చెప్పి నీళ్లను అందించాలని జగదీష్ రెడ్డి డిమాండ్ చేశారు.

Tags:    

Similar News