రేపే లోక్ సభ స్పీకర్ ఎన్నిక..కాంగ్రెస్ పార్టీ ఎంపీలకు విప్ జారీ

లోక్ సభ స్పీకర్‌ ఎన్నికలో వైసీపీ ఎటువైపు నిలబడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

By :  Vamshi
Update: 2024-06-25 14:24 GMT

రేపు లోక్ సభ స్పీకర్ ఎన్నికపై ఓటింగ్ ఉన్న నేపథ్యంలో తమ ఎంపీలకు కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. బుధవారం 11 గంటల నుంచి సభ వాయిదా పడే వరుకు అందరు లోక్ సభలో ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ కే. సురేశ్ ఆదేశించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి నుండి సీనియర్ ఎంపీ సురేష్ పోటీ చేస్తున్నారు. రేపు (బుధవారం) లోక్ సభ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎన్డీఏ, ఇండియా కూటములు దేశ రాజధానిలో ఢిల్లీలో పోటా పోటీ సమావేశాలు ఏర్పాటు చేశాయి.

ప్రస్తుతం లోక్‌సభలో ఎన్డీఏ కూటమికి 293 మంది సభ్యులు, ఇండియా కూటమికి 232 మంది సభ్యులు ఉన్నారు. దీంతో ఎన్డీఏ అభ్యర్థి ఓంబిర్లా స్పీకర్‌గా ఎన్నిక కావడం అనివార్యమే. అయితే ఈ ఎన్నిక ఇప్పుడు ఏ కూటమిలో లేని వైసీపీకి ఓ పరీక్ష లాంటింది. వైసీపీకి లోక్‌సభలో నలుగురు ఎంపీలున్నారు. స్పీకర్‌ ఎన్నికలో వైసీపీ ఎటువైపు నిలబడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పోరాడింది ఎన్డీఏ కూటమితోనే. మరీ అలాంటి కూటమికే సపోర్ట్ చేస్తుందా.. లేదా, గతాన్ని మరిచి కాంగ్రెస్‌, దాని మిత్రపక్షాలు నిలబెట్టిన అభ్యర్థికి మద్దతిస్తుందా అనేది ఆసక్తిగా ఉంది

Tags:    

Similar News