ఉచిత బస్సు పథకం తప్ప..ఏ ఒక్క హామీ అమలు కాలేదు : మోత్కుపల్లి

రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం తప్ప. ఏ ఒక్క హామీ అమలు కాదేంటూ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు.

By :  Vamshi
Update: 2024-07-11 10:25 GMT

మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాంగ్రెస్ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉచిత బస్సు పథకం తప్ప ఏ ఒక్క హామీ అమలు కాలేదన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగుల బాధలను సీఎం రేవంత్ పట్టించుకోకపోవడం శోచనీయమని అన్నారు. కష్టకాలంలో నిరుద్యోగులని ఆదుకోవాల్సింది పోయి ముళ్ల కంచెలతో నిర్భంధించి కొడుతున్నారని ఆరోపించారు.

సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే రానున్న రోజుల్లో పార్టీ కనుమరుగు అవ్వడం ఖాయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై చెడ్డపేరు రాకముందే ప్రజా సమస్యలపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. తాను నిజాయితీగా, ఉన్నందుకే తనకు పోయిన ఎన్నికల్లో టికెట్ రాలేదంటూ మోత్కుపల్లి వాపోయారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డితో సమానంగా అన్ని ప్రభుత్వం ప్రకటనపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఫొటో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News