బడ్జెట్‌లో ముస్లింలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది : ఇంతియాజ్ ఇసాక్

బడ్జెట్లో రూ.5వేల కోట్ల హామీ ఇచ్చి రూ.3వేల కోట్లు కేటాయించడం సరికాదని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ ఇసాక్ అన్నారు

By :  Vamshi
Update: 2024-07-25 12:26 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మాదిరిగానే మరోసారి మైనార్టీ ముస్లింలను మోసం చేసిందని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ , బీ ఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఐసాక్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే మైనార్టీ ముస్లింల సంక్షేమం కోసం రూ.4 వేల కోట్లు, స్వయం ఉపాధి కోసం రూ.1000కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు బడ్జెట్ లో కేవలం రూ.3003 కోట్లే కేటాయించడం సరికాదన్నారు.

ఎస్సీ, ఎస్టీల మాదిరిగా మైనార్టీల కోసం సబ్ ప్లాన్ ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందని సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు. ముస్లింల ఓట్లతో అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ హామీలను విస్మరిస్తోందని ఆరోపించారు. అదే విధంగా రేవంత్ సర్కార్ మైనార్టీ గురుకులాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఎన్నికల సమయంలో ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా వాడుకోవడమే కాంగ్రెస్ పార్టీ నైజమని తెలిపారు. రేవంత్ ప్రభుత్వం అవలంభిస్తున్న ముస్లిం వ్యతిరేక విధానాలపై త్వరలో ముస్లిం మేధావులు, ప్రజాసంఘాల నాయకులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తామని ఇంతియాజ్ ఇసాక్ తెలిపారు .

Tags:    

Similar News