ఎమ్మెల్యే పోచారం ఇంటికి సీఎం రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ అసెంబ్లీ స్పీకర్‌, బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనను కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని సీఎం ఆహ్వానించినట్టు తెలిసింది.

By :  Raju
Update: 2024-06-21 05:53 GMT

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాజీ అసెంబ్లీ స్పీకర్‌, బాన్స్‌వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయనను కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలని సీఎం ఆహ్వానించినట్టు తెలిసింది. సీఎం వెంట పోచారం ఇంటికి వెళ్లిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి. పోచారం కూడా సీఎంను కండువా కప్పి ఆహ్వానించారు.

కొంతకాలంగా పార్టీ మారాలని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్‌ ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పోచారం తనయుడు భాస్కర్‌రెడ్డి డీసీసీబీ ఛైర్మన్‌ పదవి నుంచి తొలిగించడానికి అవిశ్వాస తీర్మానం పెడితే ఆయనే రాజీనామా చేశారు. ఇలా బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలకు తెర లేపిన కాంగ్రెస్‌ నేతలు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ చేరుతారని కాంగ్రెస్‌ నేతలు లీకులు ఇస్తున్నారు.

సీఎం పాలన గాలికి వదిలేసి విపక్ష పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌ పార్టీలోకి చేర్చుకునే కార్యక్రమాన్ని మొదలుపెట్టారని విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి తీసుకురావడం వెనుక ఆపార్టీ అధిష్ఠానమే ఉన్నదంటున్నారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఫిరాయింపు చట్టాన్ని మరింత పటిష్టం చేస్తామన్న ఆపార్టీ చెప్పిన మాటలకు చేతలకు పొంతన ఉండటం లేదని నెటిజన్లు మండిపడుతున్నారు. 

Tags:    

Similar News