చంద్రబాబు ప్రజలను మభ్య పెట్టి గెలిచారు : జగన్

ముఖ్యమంత్రి చంద్రబాబు బిర్యానీ పెడతానని చెప్పి మోసం చేస్తున్నాడని జనం మాట్లాడుతున్నరని, జగన్ అధికారంలో ఉన్నప్పుడు పలావు పెట్టి ప్రశాంతంగా చూసుకున్నారని ప్రజలు అనుకుంటున్నరని జగన్ అన్నారు.

Update: 2024-08-13 10:34 GMT

అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయటంలో సీఎం చంద్రబాబు విఫలం అయ్యారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. ఇవాళ తాడేపల్లి క్యాంప్ ఆఫీసు‌లో అనకాపల్లి, మాడుగుల, చోడవరం నియోజకవర్గాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో సమావేశమయ్యారు. చంద్రబాబు బిర్యానీ పెడతానని చెప్పి మోసం చేస్తున్నడని ప్రజలు అనుకుంటుకున్నరని కానీ ఇప్పుడు పలావు లేదు, బిర్యానీ లేదు... ప్రజలకు పస్తులుండల్సిన పరిస్థితి అని జగన్ అన్నారు. ఎంతో ఆర్ధిక సంక్షోభం ఉన్నా గత వైసీపీ సర్కార్ సాకులు చూపలేదని జగన్ పేర్కొన్నారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌లా భావించాం. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి మాటకోసం కట్టుబడి పనిచేశాం. ప్రతి ఇంటికీ మించి చేశాం. చేసిన మంచి ఎక్కడికీ పోదు. వచ్చే ఎన్నికలు వచ్చేసరికి ఈ మంచే మనకు శ్రీరామ రక్ష’’ అని జగన్‌ అన్నారు. వైసీపీ అధికారంలో ఉండి ఉంటే ప్రజలకు ఈ పరిస్థితి వచ్చేది కాదని తెలిపారు.

రైతు భరోసా అందడంలేదు, అమ్మ ఒడి లేదు... విద్యా దీవెన, వసతి దీవెన, సున్నా వడ్డీ, వాహనమిత్ర, ఫీజు రీయింబర్స్ మెంట్, మత్స్యకార భరోసా, ఉచిత పంటల బీమా ప్రీమియం... ఇవేవీ అందడంలేదు. చంద్రబాబు చేస్తున్న మోసాలను గమనిస్తున్న ప్రజల్లో వ్యతిరేకత మొదలైదన్నారు. మనం మంచి పనులే చేశామని భావిస్తున్నరని జగన్ చెప్పారు. ఐదేళ్ల కూటమి పాలనలో వేధింపులకు గురిచేస్తారు. కష్టాలు కూడా ఉంటాయి. నా పరిస్థితులే దీనికి ఉదాహరణ. నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. కాని కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి తర్వాత వెలుగు ఉంటుంది. ఇది సృష్టిసహజం. అలాగే ఈ ఐదేళ్లుకూడా ముగుస్తాయి, మనమే అధికారంలోకి వస్తాం. విలువలు, విశ్వసనీయతమీదే మనం రాజకీయాలు చేస్తున్నాం. మోసాలకు, అబద్ధాలకు చంద్రబాబు, తెలుగు దేశం పార్టీ అలవాటు పడింది’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు.

Tags:    

Similar News