విద్యుత్‌ మీటర్లపై అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ వాయిదా తీర్మానం

విద్యుత్‌ మీటర్ల విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బురదజల్లే విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సభను తప్పుదోవ పట్టించిన అంశంపై అసెంబ్లీలో చర్చించాలని పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు.

By :  Vamshi
Update: 2024-07-29 04:39 GMT

కరెంట్ మీటర్ల విషయంలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై బురదజల్లే విధంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సభను తప్పుదోవ పట్టించిన అంశంపై శాసన సభలో చర్చించాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి అడ్జెంట్‌మెంట్‌ నోటీసులిచ్చారు శనివారం అసెంబ్లీలో బడ్జెట్‌పై సాధారణ చర్చలో భాగంగా విద్యుత్‌ మీటర్ల అంశంపై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం ఇస్తూ.. తెలంగాణ ప్రభుత్వం ఒకవేళ ఈ ఒప్పందాలను అమలు చేయకపోతే, స్మార్ట్‌ మీటర్లు బిగించకపోతే అగ్రిమెంట్‌ను ఉల్లంఘించామని కేంద్ర ప్రభుత్వం డిస్కంలపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

తెలంగాణ అసెంబ్లీలో ఇవాళ బడ్జెట్‌ సమావేశాల్లో ఐదో రోజు పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరగనుంది. తెలంగాణ ప్రభుత్వానికి, విద్యుత్‌శాఖకు విధిలేని పరిస్థితి ఏర్పడింది. విధిలేని పరిస్థితుల్లోనే వినియోగదారులకు స్మార్ట్‌మీటర్లు పెట్టక తప్పని పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడిందన్నారు. అయితే ఈ ఆరోపణలపై సమాధానమివ్వడానికి బీఆర్‌ఎస్‌కు అవకాశం ఇవ్వకుండానే సభ సోమవారానికి వాయిదా పడింది. నేపథ్యంలో నేడు ఈ అంశంపై సభలో చర్చించాలని కేటీఆర్‌ వాయిదా తీర్మానం ఇచ్చారు.

Tags:    

Similar News