అప్పులు చేస్తున్నారు.. ఒక్క హామీని అమలు చేస్తలేరు: దేవీప్రసాద్‌

కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన ఏడు నెలల కాలంలోనే రూ. 28 వేల అప్పులు చేసింది. కానీ ఒక్క హామీ అమలు చేయలేదని దేవీప్రసాద్‌ విమర్శించారు.

By :  Raju
Update: 2024-06-26 08:58 GMT

ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ ఆరు నెలల ఏలుబడిలో పరిపాలన పూర్తిగా గాడి తప్పిందని బీఆర్‌ఎస్‌ నేత, తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్‌ దేవీప్రసాద్‌ విమర్శించారు. తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రజలకు సంబంధించి ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేయడం లేదు. బీఆర్‌ఎస్‌ పాలనలో ఒకవైపు సంక్షేమం, మరోవైపు అభివృద్ధిని చేసి చూపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రేవంత్‌ ప్రభుత్వం ఇప్పటికే రూ. 28 వేల కోట్ల రూపాయలు అప్పు చేసింది. కానీ ఆపార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయలేదు. రుణమాఫీకి ఎవరు అర్హులో, ఎవరు కాదో ఇప్పటికీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదు. అలాగే రైతు భరోసాకు కూడా ఎవరు అర్హులో ప్రభుత్వం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలనను గాలికి వదిలేసి సీఎం ఢిల్లీ పర్యటలో బిజీగా ఉన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై అన్నివర్గాల వాళ్లు రోడ్ల మీదికి వస్తున్నారు. అన్నివర్గాలకు బీఆర్‌ఎస్‌ అండగా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రానికి మొదటి గిఫ్ట్‌గా బొగ్గు గనులను వేలం వేశారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని వేలం వేస్తారో తెలియదని విమర్శించారు. వేలం వేస్తుంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అడ్డుకోకపోగా అందులో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలపై కాంగ్రెస్‌ పార్టీ రెండు నాలుకల ధోరణికి ఇదే నిదర్శనం అన్నారు. 

Tags:    

Similar News