బండి సంజయ్, రేవంత్ రెడ్డికి కోవర్టు : కేపీ వివేకానంద

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలన్నీ అటకెక్కించిందని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు

By :  Vamshi
Update: 2024-08-11 12:10 GMT

సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులను నిండా ముంచారని కుత్బుల్లాపూర్‌ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో కలిసి మాట్లాడారు. కాంగ్రస్ ప్రభుత్వంలో ఐటీ ఉద్యోగాల కల్పన భారీగా పడిపోయిందని ఆయన అన్నారు. గత బీఆర్‌ఎస్‌ పాలనలో 25 లక్షల మంది ఉపాధి అవకాశాలు కల్పించినం. బీఆర్‌ఎస్‌ హయాంలో ఐటీ సెక్టార్‌లో 6లక్షల ఉద్యోగాలు వచ్చాయి వివేకానంద్ పేర్కొన్నారు. నిన్న అమరాజా కంపెనీ ప్రభుత్వం నుంచి సహకారం రావడం లేదని ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తుంటే సర్కార్ ఏం చేస్తుందని ప్రశ్నించారు. కంపెనీలు తెలంగాణ నుంచి తరలిపోతామని చెప్తోందని.. ఉన్న పెట్టుబడులు పోకుండా కాంగ్రెస్ ప్రభుత్వం చూడాలని సూచించారు.

కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ముఖ్యమంత్రి సహాయ మంత్రిగా మారిపోయారు ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ్ముడు కంపెనీలో పెట్టుబడి తీసుకొస్తుంటే ఆయన ఏం చేస్తున్నారు నిలదీశారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్థిస్తుందా అని వివేకానంద్ ప్రశ్నించారు. నిరుద్యోగులు పోరాడాటలు చేస్తున్న బీజేపీనాయకులు మద్దతు ఇవ్వరని.. బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని మండిపడ్డారు.హైదరాబాద్ నగరంలో పారిశుద్ధ్యం లోపించిందని ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ అన్నారు. హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయిని పేర్కొన్నారు. పాత బస్తీలో రోజుకో మర్డర్ జరుగుతోందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్ని ఏం చేస్తున్నరని ప్రశ్నించారు. దోమలతో డెంగ్యూ జ్వరాలు విజృంభిస్తున్నాయిని గవర్నమెంట్ హాస్పిటల్ లో కనీస వసతులు కరువయ్యాయి అన్నారు.

Tags:    

Similar News