ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులా?

బీఆర్ఎస్ నాయకుడు మేడె రాజీవ్ సాగర్

Update: 2024-08-22 15:51 GMT

ప్రభుత్వ తప్పిదాలను నిగ్గదీసి ప్రశ్నించే జర్నలిస్టులపై దాడులు చేస్తారా అని బీఆర్ఎస్ నాయకుడు, తెలంగాణ ఫుడ్స్ మాజీ చైర్మన్ మేడె రాజీవ్ సాగర్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో మహిళ జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి అనుచరుల దాడిని ఆయన ఖండించారు. కొండారెడ్డిపల్లి ఏమైనా నిషేధిత ప్రాంతమా.. అక్కడికి ఎవరూ వెళ్లకూడదా అని ప్రశ్నించారు. వందశాతం రుణమాఫీ జరిగితే సీఎం స్వగ్రామంలోకి మీడియాను ఎందుకు రానివ్వట్లేదని ప్రశ్నించారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడీ బయట పడుతుందనే భయంతోనే జర్నలిస్టులపై దాడులకు తెగబడ్డారని అన్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్లలో మహిళ జర్నలిస్టులపై ఎక్కడా దాడులు జరగలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే సీఎం స్వగ్రామంలో ఇలాంటి దాడులకు పాల్పడటం దారుణమన్నారు. దాడి చేసిన వారిపై మహిళ కమిషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్, పార్టీ నాయకులు రఘునందన్ రెడ్డిపై తిరుమలగిరిలో దాడి చేశారని.. తమపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందనే అక్కసుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి దాడులను ప్రోత్సహిస్తోందని అన్నారు.

Tags:    

Similar News