ఈ నెల 26 వరుకు ఏపీ అసెంబ్లీ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై బీఏసీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 26 వరుకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

By :  Vamshi
Update: 2024-07-22 08:30 GMT

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 26 వరుకు జరగనున్నాయి. స్పీకర్ అయ్యన్నపాత్రుడి అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉంటే 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వంటి బిల్లులతో పాటు కొన్ని శ్వేతపత్రాలను ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్టు స్పీకర్ తెలిపారు. సీఎం చంద్రబాబు సూచనతో నలుగురు ప్యానల్ స్పీకర్లను నియమించనున్నట్టు వెల్లడించారు. వీటితో పాటు ప్రభుత్వం కొన్ని శ్వేతపత్రాలు ప్రవేశపెడుతుంది. వచ్చే సమావేశాల్లోపు కొత్త ఎమ్మెల్యేలకు శిక్షణ ఇస్తాం. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల భవనాలు 80 శాతం పూర్తయ్యాయి. 9 నెలల్లో అవి అందుబాటులోకి వస్తాయి’’ అని స్పీకర్‌ తెలిపారు.

గవర్నర్‌ ప్రసంగంపై మంగళవారం చర్చ జరగనుంది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ను రద్దు చేస్తూ ఉపసంహరణ బిల్లును ప్రభుత్వం మంగళవారం సభలో ప్రవేశ పెట్టనుంది. గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు, ఎక్సైజ్‌ విధానం, రాష్ట్ర అప్పులు-ఆర్థిక స్థితికి సంబంధించి శ్వేతపత్రాలను విడుదల చేయనుంది. వీటిపై సభ్యులు చర్చించే అవకాశముంది. టీడీపీ తరఫున సీఎం చంద్రబాబు, మంత్రి పయ్యావుల కేశవ్‌, జనసేన నుంచి మంత్రి నాదెండ్ల మనోహర్‌, బీజేపీ తరఫున ఎమ్మెల్యే విష్ణుకుమార్‌ రాజు హాజరయ్యారు

Tags:    

Similar News