అసెంబ్లీలో దానం వాఖ్యలు సమాజం తలదించుకునే విధంగా ఉన్నాయి : సబిత ఇంద్రారెడ్డి

ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడిన భాష సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉన్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి అన్నారు.

By :  Vamshi
Update: 2024-08-02 14:09 GMT

తెలంగాణ శాసన సభలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడిన భాష సభ్య సమాజం తల దించుకునే విధంగా ఉన్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబిత ఇంద్రారెడ్డి అన్నారు. గన్‌పార్క్ అమరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బైఠాయించి నిరసన తెలిపారు.హైదరాబాద్ సిటి మీదా చర్చ జరుగుతుంటే ... కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ఏంటి అని మేము అడుగుదాం అనుకున్నామని సబితా అన్నారు. అసెంబ్లీ స్పీకర్ నిన్న మాకు చాల నీతులు చెప్పారని..ఈరోజు దానం నాగేందర్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూస్తామని ఆమె అన్నారు. స్పీకర్ ఎమ్మెల్యే దానంపై చర్యలు తీసుకోవాలని సబిత డిమాండ్ చేశారు.

Tags:    

Similar News