మహిళ జర్నలిస్టులపై దాడి జరిగినా స్పందించరా?

మీరు ఎవరికి అమ్ముడుపోయారు.. ఎందుకు వెదవ రాజకీయాలు చేస్తున్నారు : ఎన్ఆర్ఐ తిరుపతి రెడ్డి

Update: 2024-08-23 07:12 GMT

మహిళ జర్నలిస్టులపై దాడి జరిగినా స్పందించరా అని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సెల్ నాయకుడు తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఈమేరకు ఆయన ఒక వీడియో సందేశం విడుదల చేశారు. సీఎం రేవంత్ రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో సీనియర్ మహిళ జర్నలిస్టులు సరిత, విజయారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం హేయమైన చర్య అన్నారు. కేసీఆర్ పాలనలో వేరే కారణాలతో జర్నలిస్టులను పోలీసులు అరెస్ట్ చేస్తే నానా యాగి చేసే తీన్మార్ మల్లన్న, తొలివెలుగు రఘు.. మహిళ జర్నలిస్టులపై కాంగ్రెస్ లీడర్లు, సీఎం రేవంత్ రెడ్డి అనుచరుల దాడిని ఎందుకు ఖండించడం లేదో చెప్పాలన్నారు. వారి తీరుతో జర్నలిస్టులు తలవంచుకునే పరిస్థితి వచ్చిందన్నారు. కొందరు జర్నలిస్టులు ఎవరికి అమ్ముడుపోయి మహిళ జర్నలిస్టులపై దాడి ఘటనపై నోరు మెదపడం లేదో చెప్పాలన్నారు. వెదక రాజకీయాలు చేయవద్దని.. జర్నలిస్టులంతా మహిళ జర్నలిస్టులకు బాసటగా నిలవాలని డిమాండ్ చేశారు.

తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రైతు రుణమాఫీ కోసం ధర్నా చేస్తున్న రైతులు, బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నేతలు పొగాబాంబుతో దాడి చేశారంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఎంతలా క్షీణించాయో స్పష్టమవుతుందన్నారు. పొగబాంబుతో దాడి చేయడం అంటే ఆటవికమైన, కిరాతకమైన చర్య అని.. పోరాటాల పురిటిగడ్డ తెలంగాణ సమాజం ఇలాంటి దాడులను ఎప్పటికీ సహించబోదన్నారు. దశాబ్దాల పోరాటం చేసి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న చరిత్ర మనదని అన్నారు. ప్రజలకు ఏమి తెలియదని అనుకోవద్దని.. వాళ్లు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే శాంతిభద్రతలు దెబ్బతింటాయనడానికి గురువారం జరిగిన రెండు సంఘటనలు అద్దం పడుతున్నాయని అన్నారు. గడిచిన తొమ్మిది నెలలుగా రాష్ట్రంలో మహిళలకు, ప్రజలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై రేపులు, హత్యాచారాలు.. హైదరాబాద్ నగరంలో పెరుగుతోన్న క్రైమ్ రాష్ట్రంలో క్షీణించిన శాంతి భద్రతలకు అద్దం పడుతున్నాయని అన్నారు. సీఎం స్వయంగా హోం శాఖను పర్యవేక్షిస్తున్నా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి ఆరు గ్యారంటీలు, వాళ్లు ఇచ్చిన హామీలను నెరవేర్చడానికి ఐక్య పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు.

Tags:    

Similar News