అక్బరుద్దీన్‌ను డిప్యూటీ సీఎం చేస్తా..సీఎం రేవంత్‌ షాకింగ్ కామెంట్స్

అక్బరుద్దీన్ ఒవైసీ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ బీ ఫామ్‌పై కొడంగల్ నియోజవర్గం నుండి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

By :  Vamshi
Update: 2024-07-27 12:27 GMT

ఎంఐఎం ఎల్పీ లీడర్ చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలోకి వస్తే డిప్యూటీ సీఎం చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. హస్తం పార్టీ బీ ఫామ్‌పై కొడంగల్ నియోజవర్గం నుండి పోటీ చేస్తే గెలిపించే బాధ్యత నేను తీసుకుంటానని, చీఫ్ ఎన్నికల ఏజెంట్‌గా ఉండి అక్బరుద్దీన్‌ను విజయానికి కోసం కృషి చేస్తానన్నారు. అక్బరుద్దీన్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి శాసన సభలో నా పక్కనే కూర్చొబెట్టుకుంటానని సీఎం కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ వ్యాఖ్యలపై వెంటనే అక్బరుద్దీన్ ఒవైసీ రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. మజ్లిస్ పార్టీలో నేను సంతోషంగానే ఉన్నానని స్పష్టం చేశారు.

తాను పార్టీ మారే ప్రసక్తే లేదని.. చివరి శ్వాస వరకు ఎంఐఎం పార్టీలోనే కొనసాగుతానని రేవంత్ కామెంట్స్‌కు కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి, అక్బరుద్దీన్ కామెంట్స్‌కు అసెంబ్లీలో హాల్‌లోని సభ్యులంతా నవ్వారు. పాతబస్తీ అంటే ఓల్డ్ సిటీ కాదని.. అది ఒరిజినల్ సిటీ అని పేర్కొన్నారు. జైపాల్ రెడ్డి కేంద్ర అర్బన్ డెవలప్‌మెంట్ మంత్రిగా వయబుల్ గ్యాప్ ఫండ్ తీసుకువచ్చి హైదరాబాద్ మెట్రో నిర్మాణానికి కృషి చేశారని తెలిపారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో ఓల్డ్ సిటీకి మెట్రో రైల్ అందుబాటులోకి తీసుకురాలేదన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే పాతబస్తీ మెట్రోకు శంఖుస్థాపన చేశామన్నారు. రెండో దశలో 78 కి.మీ మెట్రో ప్రాజెక్టు కోసం కేంద్రానికి నివేదిక సమర్పించామన్నారు. నాలుగేళ్లలో ఓల్డ్ సిటీ మెట్రో పనులు పూర్తి చేసే బాధ్యత తమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Tags:    

Similar News